యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా హాజరవగా.. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన డ్యాన్స్ చేస్తూనే సాంగ్స్ కంపోజ్ చేస్తారు. అందుకే పాటల్లో అంత ఎనర్జీ వుంటుంది. ఇందులో బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. శ్యాం దత్ గారు విజువల్స్ ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. నాగేంద్ర గారు ప్రతి సెట్ కి లైఫ్ తీసుకొచ్చారు. అల్లు అరవింద్ గారు నాకు తండ్రిలాంటి వారు. బన్నీవాసు గారు చాలా పాషన్ తో సినిమాని చేశారు.”
“సందీప్ రెడ్డి వంగా గారు ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు. ఫిలిం మేకర్ కి ఆ వాయిస్ వుండాలి. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. చైతన్య గారు ఈ సినిమా కోసం చాలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆయనలో ఓ ఆకలి కనిపించింది. చాలా హార్డ్ వర్క్ చేశారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన అందరికీ థాంక్ యూ. మేము మీ సినిమానే తీశాం. చాలా మంచి సినిమా ఇది. మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























