సలార్ వచ్చి ఏడాదికిపైనే అవుతుంది.సలార్ 2 కోసం సలార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ ప్లాఫుల్లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ కు సాలిడ్ హిట్ ఇచ్చి ఫామ్ లోకి తెచ్చింది.ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ,ప్రభాస్ ను చూపెట్టిన విధానంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాదాపు 700 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది.ఇక సలార్ సీక్వెల్ గత ఏడాదే స్టార్ట్ అవ్వాల్సివుండగా వాయిదాపడింది. అయితే ఈ ఏడాది కూడా సలార్ 2 సెట్స్ మీదకు వెళ్లేలా కనిపించడం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రశాంత్ నీల్ సలార్ తరువాత ఎన్టీఆర్ తో సినిమాకు కమిట్ అయ్యాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీ లో వార్ 2 చేస్తున్నాడు.ఇది పూర్తికావొచ్చింది. వచ్చే నెలలో ఎన్టీఆర్ నీల్ తో సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇది పూర్తి కావడానికి చాలా సమయం పట్టనుంది.దాంతో సలార్ 2ను వచ్చే ఏడాదే మొదలుపెట్టనున్నారు. ఈవిషయాన్ని మలయాళ నటుడు ,సలార్ లో కీలక పాత్రలో కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ ఫర్మ్ చేశాడు .ఓ ఇంటర్వ్యూ లో భాగంగా సలార్ 2 అప్డేట్ అడుగగా దానికి పృథ్వీరాజ్… సలార్ 2 పక్కా ఉంటుంది అయితే ప్రశాంత్ నీల్ ,ఎన్టీఆర్ తో సినిమా చేసే పనిలో వున్నాడు అది కంప్లీట్ అయ్యాక సలార్ 2 కోసం అందరం కలుస్తామని సమాధానం ఇచ్చాడు.ఆ లెక్కన సలార్ 2 వచ్చే ఏడాదే మొదలుకానుంది.
మరోవైపు ప్రభాస్ ,హను రాఘవపూడితో చేస్తున్న సినిమాతో బిజీ గా వున్నాడు .ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.సమ్మర్ లోపు మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయాలనీ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక ప్రభాస్ ఈసినిమా కన్నా ముందు ది రాజాసాబ్ తో రానున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.మారుతి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























