బాలకృష్ణని సన్మానించిన అఖండ 2 టీం

Akhanda 2 Team Felicitates Nandamuri Balakrishna on Receiving Padma Bhushan Award

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ పురస్కారం పొందిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి ఆయ‌న చేసిన కృషికి గాను కేంద్ర ప్ర‌భుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో సినీ ప్ర‌ముఖులు బాలకృష్ణకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదే క్రమంలో తాజాగా ‘అఖండ 2: తాండవం’ మూవీ టీం బాలకృష్ణను సన్మానించింది. పద్మభూషణ్‌ పురస్కారం పొందిన తర్వాత తొలిసారి బాలయ్య షూటింగ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనను ఘనంగా సన్మానించింది. మూవీ టీం అంతా కలిసి కేక్ ని కట్ చేసి బాలకృష్ణకు తమ అభినందనలు తెలియజేశారు.

బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి మునుపటి బ్లాక్ బస్టర్ ‘అఖండ’ కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ యాక్షన్, ఇంటెన్స్ మూవీ సినీ ప్రియులను స్పిరిచ్యువల్‌గా నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లనుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో బిగ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా థియేటర్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.