మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2 షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది.బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది.ఇక ఈసినిమాకు హీరోయిన్ ను ఫైనల్ చేశారు.సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్ గా నటించనుంది.ఈరోజు సంయుక్త షూటింగ్ లో జాయిన్ అయ్యింది.తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.దసరా కానుకగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే సంక్రాంతి టైంలో బాలకృష్ణ, డాకు మహారాజ్ తో ప్రేక్షకులముందుకు రాగ ఈసినిమా ప్రస్తుతం థియేటర్లలో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 165కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారాంతం లో బ్రేక్ ఈవెన్ ను చేరుకోనుంది.బాబీ డైరెక్ట్ చేయగా తమన్ సంగీతం అందించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
ఇక అఖండ తో పరాజయాలకు బ్రేక్ వేసి ఫామ్ లోకి వచ్చాడు బాలకృష్ణ. ఈసినిమా తరువాత చేసినవన్నీ సూపర్ హిట్ అయ్యాయి.అఖండ తరువాత వీరసింహా రెడ్డి ,భగవంత్ కేసరి లతో హ్యాట్రిక్ కొట్టగా డాకు మహారాజ్ తో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.మరి అఖండ 2 తో బాలకృష్ణ తన సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























