రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ హవా కొనసాగిస్తోంది.ఇప్పటికే ఈసినిమా 200కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వగా వీక్ డేస్ లోనూ హౌస్ ఫుల్ బోర్డులు పడుతుండడం తో 9రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 230కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్ , డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ లో ఇదే మొదటి 200కోట్ల సినిమా.ఇక ఈసినిమా ఊపు చూస్తుంటే ఫుల్ రన్ లో 300కోట్ల మార్క్ ను టచ్ చేసేలానే వుంది.మిగితా సినిమాల నుండి పోటీ లేకపోవడం అలాగే తండేల్ వచ్చే వరకు చెప్పుకోదగ్గ సినిమాల రిలీజ్ లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు యూఎస్ఏ లోనూ ఈసినిమా అదరగొడుతుంది.ఇప్పటివరకు అక్కడ 2.5 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యి ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం గొప్ప విషయం.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ బాగుండడంతో సంక్రాంతికి వస్తున్నాం ఉహించని రన్ ను కొనసాగిస్తోంది.ఈసినిమాతో వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాదించాడు.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్ ,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. దల్ రాజు , శిరీష్ ఈసినిమాను నిర్మించారు. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదు. ఎందుకంటే అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ని మెగా స్టార్ చిరంజీవి తో చేస్తున్నాడు. సో అనిల్ ఇది పూర్తి చేసి కానీ వెంకటేష్ తో సినిమాను స్టార్ట్ చేయడు .
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























