పరదా నా కెరీర్ లోనే ఫేవరేట్ ఫిలిం – అనుపమ

Anupama Parameswaran talks about paradha movie

అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా పరదా. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈసినిమాను తెరకెక్కిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు.ఇక నిన్న ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్ జరుగగా ఇందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. టీజర్ ప్లే చేసినప్పుడు నా పదేళ్ళ జర్నీ కనిపించింది. చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ రోజు ఆనందంతో పాటు ఒక బాధ్యత కనిపిస్తోంది. మిమల్ని అలరించడానికి ఇలాంటి మంచి పాత్రలు మరిన్ని చేయాలనే రెస్పాన్స్ బులిటీ. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అవుతుంది. ఈ పదేళ్ళలో నా మోస్ట్ ఫేవరేట్ ఫిలిం పరదా, మోస్ట్ ఫేవరేట్ క్యారెక్టర్ సుబ్బు. ఈ సినిమా అందరూ ఇష్టపడి చేసిన సినిమా, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా.టీం అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్.నన్ను నమ్మి బిలీవ్ చేసిన విజయ్ గారికి ప్రవీణ్ గారి థాంక్ యూ.మీ అందరి సపోర్ట్ కి థాంక్ యూ అన్నారు.

హీరోయిన్ దర్శన మాట్లాడుతూ.. మీ అందరి ప్రేమకి థాంక్ యూ. ప్రవీణ్ చాలా హార్ట్ ఫుల్ గా ఈ సినిమా తీశారు. ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం. చాలా టఫ్ ఛాలెంజ్ తీసుకున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ వున్నారు.అనుపమ,సంగీత గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఈ సినిమాలో మ్యాజిక్ కు మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు

యాక్టర్ సంగీత మాట్లాడుతూ.. ఆనంద మీడియా లాంచ్ చేసిన నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ప్రవీణ్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్ సినిమాలో చేయడం ఆనందంగా వుంది. టీం అందరికీ థాంక్ యూ. అనుపమ, దర్శన నుంచి చాలా నేర్చుకున్నారు. చాలా కూల్ గా వుంటారు. ఇలాంటి గొప్ప కథని రాసిన డైరెక్టర్ కి థాంక్. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.