డాకు మహారాజ్ 10 డేస్ కలెక్షన్స్ 

daaku maharaaj 10 days collections

బాలకృష్ణ డాకు మహారాజ్ 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన  ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ తో  10రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో భగవంత్ కేసరి లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేసి బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో నిన్నటి వరకు  94శాతం రికవరీ చేసింది. ఈవారం లో టార్గెట్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.అయితే  ఫుల్ రన్ లో 200కోట్ల మార్క్ ను టచ్ చేయడం అసాధ్యమే.ఎందుకంటే ఈ సినిమాకు బాక్సాఫీస్  వద్ద సంక్రాంతికి వస్తున్నాం తో తీవ్రమైన పోటీ ఎదురువుతుంది.డాకు మహారాజ్ ను బాబీ తెరకెక్కించగా ఇందులో శ్రద్దా శ్రీనాథ్ ,ప్రగ్యా జైస్వాల్ ,ఊర్వశి రౌతేలా  కీలక పాత్రల్లో నటించారు.బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించాడు.తమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి.ఈరోజు అనంతపురంలో ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ జరుగనుంది. 

ఇక బాలకృష్ణ ఈ ఏడాది మరో  సారి మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం ఆయన అఖండ సీక్వెల్ అఖండ 2 లో నటిస్తున్నాడు.బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.14 రీల్స్ ప్లస్ ఈసినిమాను నిర్మిస్తుంది.దసరాకు విడుదలకానుంది. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమా కూడా విజయం సాధిస్తే బాలకృష్ణ వరసగా 5వ హిట్ ను ఖాతాలో వేసుకోనున్నాడు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.