రివ్యూ : సంక్రాంతికి వస్తున్నాం

Sankranthiki Vasthunam review in telugu

నటీనటులు : వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి,నరేశ్
ఎడిటింగ్ : తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి
సంగీతం :భీమ్స్ సిసిరోలియో
దర్శకత్వం :అనిల్ రావిపూడి
నిర్మాత : శిరీష్
సమర్పణ : దిల్ రాజు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటివరకు అపజయం లేకుండా కొనసాగుతున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు.ఎఫ్ 2 తో ఫ్యామిలీ ఆడియన్సు లోనూ క్రేజ్ తెచ్చుకున్నారు, ఈదర్శకుడి నుండి ఈ సంక్రాంతికి వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఇందులో విక్టరీ వెంకటేష్ హీరో నటించడం అలాగే విడుదలకు ముందు ట్రైలర్, సాంగ్స్ అన్ని సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది.మరి ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఎలా వుంది ? అనిల్ రావిపూడి ఖాతాలో మరో విజయం చేరిందా లేదో తెలుసుకుందాం .

కథ :

సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్) అమెరికాలో అతిపెద్ద ఐటీ కంపెనీ అధిపతి. బిజినెస్ పర్యటనలో భాగంగా అయన తెలంగాణకు వస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన పార్టీ సందర్భంగా, బిజ్జు ఒక గ్యాంగ్‌స్టర్ తన సోదరుడు పాపా పాండేని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సత్యను కిడ్నాప్ చేయిస్తాడు.

ఈ నేపథ్యంలో సత్యని సేవ్ చేయడం కోసం స్పెషల్ ఆపరేషన్ ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. దీనిలో భాగంగా IPS అధికారి మీను (మీనాక్షి చౌదరి) మాజీ పోలీస్ అధికారి రాజు (వెంకటేష్)ని తీసుకురావాలని సూచిస్తుంది. అయితే ఒకవైపు రాజు తన భార్య (ఐశ్వర్య) మరియు పిల్లలతో కలిసి హ్యాపీగా గడుపుతుంటాడు. కానీ మీనాక్షి వచ్చి అడిగాక ఆపరేషన్ లో భాగం కావడానికి సమ్మతిస్తాడు.

ఇదిలావుంటే, గతంలో మీను, రాజు లవర్స్ కావడంతో తన భార్య ఐశ్వర్య.. ఎక్కడ తన భర్త మళ్ళీ మాజీ లవర్ అయిన మీనాక్షి కి దగ్గర అవుతాడా అని కన్నేస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు సత్యని సేవ్ చేసే మిషన్ లో సీరియస్ నెస్ మెయింటైన్ అవుతూనే.. మరోవైపు ఫ్యామిలీ గొడవలతో మంచి ఫన్ జెనరేట్ అవుతూ ఉంటుంది.

అయితే చివరికి ఏం అయింది? రాజు కేవలం సీఎం కోరిక మేరకు వచ్చాడా? లేదా దీనివెనుక వేరే ఉద్దేశ్యం ఉందా? ఇద్దరు హీరోయిన్స్ మధ్య గొడవ లాస్ట్ కి ఎలా సాల్వ్ అయింది? ఇక ఈ ఆపరేషన్ కోసం రాజు, మీను అండ్ టీమ్ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారు అనేది మిగతా కథ.

విశ్లేషణ :

అనిల్ రావిపూడి ,వెంకటేష్ కాంబినేషన్ లో ఇంతకుముందు ఎఫ్ 2 , ఎఫ్ 3 వచ్చాయి. ఈరెండు ఫ్యామిలీ ఆడియన్సు ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంకు కూడా ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యింది. ఈసినిమాను కూడా ఫ్యామిలీ సెక్షన్ టార్గెట్ గానే తెరకెక్కించాడు.పెద్దగా ట్విస్టులు లేకుండా సింపుల్ స్క్రీన్ ప్లే తో కామెడీ ప్రధానంగా వచ్చిన సినిమా ఇది.

ఇక సినిమాలో కామెడీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. వెంకటేష్ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.వన్ లైనర్స్ బాగా పేలాయి. ఫస్ట్ అంతా ఫుల్ ఫన్ తో ఎంటర్టైన్ చేశాడు దర్శకుడు.వెంకటేష్ , ఐశ్వర్య రాజేష్ ,మీనాక్షి చౌదరిల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ తో అసలు కథలోకి ఎంట్రీ అవుతుంది.

ఓ మిషన్ కోసం వెంకటేష్ ను సెలెక్ట్ చేసుకోవడం తనతో పాటు భార్య ను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ , పోలీస్ అయినా మీనాక్షి చౌదరిని తీసుకెళ్లడం ఈ ఎపిసోడ్ అలరిస్తుంది.క్లైమాక్స్ ను కూడా బాగా డీల్ చేశాడు దర్శకుడు . పాటలు సినిమాకు అదనపు ఆకర్షణ .ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం పక్కాగా టైం పాస్ చేయిస్తుంది.ఎక్కడా అసభ్యత లేకుండా నీట్ ఎంటర్టైనర్ అందించాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

నటీనటుల విషయానికి వస్తే వెంకటేష్ నటన సినిమాకు ప్రధాన బలం. తన పాత్రను అవలీలగా చేసుకుంటూ వెళ్ళాడు.అంతేకాదు స్క్రీన్ మీద చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు.ఇక వెంకీ కి వైఫ్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ సహజంగా కనిపించింది. తన నటన కూడా చాలా బాగుంది.ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా , పోలీస్ రోల్ లో కనిపించిన మీనాక్షి చౌదరి యాక్టింగ్ తో అదరగొట్టింది. నరేష్ , విటివి గణేష్ ,అనిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయో తమ పాత్రల్లో నవ్వించారు.

టెక్నికల్ గా కూడా సినిమా సూపర్ అనిపించింది.భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు హెల్ప్ అయ్యింది పాటలు ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అవ్వగా తెర మీద కూడా చాలా బాగా అనిపించాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నీట్ గా వుంది.సినిమాటోగ్రఫీ ,ఎడిటింగ్ ఓకే. ఎస్విసి నిర్మాణ విలువలు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.

ఓవరాల్ గా పండుగకి ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా వచ్చిన ఈసంక్రాతికి వస్తున్నాం సూపర్ గా ఎంటర్టైన్ చేసింది. వెంకటేష్ నటన , కామెడీ , సాంగ్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ కామెడీ ఎంటర్టైనర్ నచ్చుతుందనడంలో సందేహం లేదు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్


మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.