గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్

game changer first day ww collections

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.దాంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకోంది.ప్రపంచ వ్యాప్తంగా 186 కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్.ఈసినిమా టాలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన నాలుగో సినిమాగా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో పుష్ప 2 మొదటి స్థానం లో ఉండగా ఆర్ఆర్ఆర్ , బాహుబలి 2, కల్కి 2898 ఏడి సినిమాలు తరువాతి స్థానంలో వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక్క తెలుగులోనూ కాదు హిందీ ,తమిళం లోకూడా ఈ సినిమా మంచి వసూళ్లను దక్కించుకుంది.ఇక పండగ సీజన్ కావడం సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.శంకర్ మార్క్ పొలిటికల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో రామ్ చరణ్ నటన ,తమన్ సంగీతం, బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇందులో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించగా అంజలి, శ్రీకాంత్ ,రాజీవ్ కనకాల, సముద్రఖని ,జయరాం కీలక పాత్రల్లో నటించారు.ఎస్ జె సూర్య విలన్ పాత్రలో మెరిశాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మించారు.అయితే రేపు బాలకృష్ణ, డాకు మహారాజ్ రిలీజ్ అవుతుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ కు పోటీ ఎదురుకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.