దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. దర్శకురాలు పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ మూవీ పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులు నటించారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్‌కి అయితే అద్భుతమైన స్పందన వస్తోంది. సుకృతి వేణి నటన అమేజింగ్ అని చెప్పొచ్చు. ఇంత చిన్నవయస్సులోనే చాలా పరిణతితో కూడిన నటనను ప్రదర్శించింది. సినిమాలో విషయం ఉందనిపించేలా ట్రైలర్ కట్ చేశారు మేకర్స్. మొత్తానికి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. చూడటానికి చిన్న సినిమానే అయినా పెద్ద హిట్ కొడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ చిత్రానికి సుకుమార్ సతీమణి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు కాగా నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ‘రీ’ సంగీతం సమకూర్చగా.. సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, విశ్వ సాహిత్యం అందించారు. శ్రీజిత్ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తుల సినిమాటోగ్రఫీ అందించగా.. హరిశంకర్ టీఎన్ ఎడిటింగ్, వి.నాని పాండు ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























