గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గేమ్ చేంజర్ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల కావటం విశేషం.
ఈ సందర్భంగా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషించిన సీనియర్ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. “నాలుగో తేదీ జరిగే ఈవెంట్‌లో మాట్లాడేందుకు మాటల్ని దాచి పెట్టుకో అని దిల్ రాజు గారు చెప్పారు. నాకు ఇంత మంచి కారెక్టర్ ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. ఈ పాత్రలో నేను మా నాన్న గారిని చూసుకున్నాను. రామ్ చరణ్ పర్ఫామెన్స్ ఇందులో సెట్స్ మీద, డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా టైంలో కంటే రామ్ చరణ్ ఇప్పుడు ఎంతో స్థాయికి ఎదిగాడు. ఈ మూవీ కోసం మా అమ్మ గారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























