గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గేమ్ చేంజర్ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల కావటం విశేషం.
ఈ సందర్భంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ అంజలి మాట్లాడుతూ.. “గేమ్ చేంజర్ నా కెరీర్లో చాలా ప్రత్యేకమైంది. ఈ పాత్రలోంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. ఇంత మంచి పాత్రను ఇచ్చినందుకు శంకర్ గారికి థాంక్స్. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయి. రామ్ చరణ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. కో ఆర్టిస్ట్‌లకు చాలా కంఫర్ట్ ఇస్తుంటారు. నా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ గారికి థాంక్స్. జనవరి 10న గేమ్ చేంజర్ ఏంటో అందరికీ తెలుస్తుంది” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























