సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌కి, సంక్రాంతికి విడదీయరాని అనుబంధముంది. ఈ సీజన్‌లో… ఆయన నటించిన 16 చిత్రాలు (తాజా చిత్రం `ఎఫ్ 2`తో కలుపుకుని) విడుదల కాగా.. వాటిలో 6 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసాయి. ఆ చిత్రాలే `శత్రువు`, `చంటి`, `కలిసుందాం…రా!`, `లక్ష్మీ`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `ఎఫ్ 2`. అయితే… ఈ ఆరు చిత్రాలకు సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే… ఈ ఆరు సినిమాల్లో నటించిన హీరోయిన్‌లంతా వెంకీతో కలసి తొలిసారిగా వెండితెరపై సందడి చేసిన వారే కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకటేష్‌కు తొలి సంక్రాంతి విజయాన్ని అందించిన `శత్రువు`లో విజయశాంతి తొలిసారిగా అతనికి జోడీగా నటించగా… `చంటి`(మీనా), కలిసుందాం… రా! (సిమ్రాన్), లక్ష్మీ (నయనతార, ఛార్మి), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (అంజలి) వంటి సంక్రాంతి బ్లాక్‌బస్టర్స్‌లోనూ ఆ ఫీట్ రిపీట్ అయ్యింది. ఇక తాజాగా విడుదలైన మరో సంక్రాంతి బ్లాక్‌బస్టర్ `ఎఫ్ 2`లో కూడా మిల్కీ బ్యూటీ తమన్నా మొదటిసారిగా వెంకీతో జట్టుకట్టింది. మొత్తమ్మీద… సంక్రాంతి సీజన్‌లో ఘనవిజయం సాధించిన వెంకీ చిత్రాలన్నింటిని గమనిస్తే… హీరోయిన్లతో `ఫస్ట్ టైమ్` కాంబినేషన్ తనకి బాగానే వర్కవుట్ అయ్యిందనే చెప్పాలి. మున్ముందు కూడా ఇది కొనసాగుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























