డిప్యూటీ సీఎం డేట్ ఇస్తే.. గేమ్ చేంజర్ ఈవెంట్ హిస్టరీ క్రియేట్ చేస్తుంది

Producer Dil Raju To Invite AP Deputy CM Pawan Kalyan For Game Changer Event

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ఆర్‌సీ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తైన ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్‌కు చిత్ర నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా దిల్ రాజు చిత్ర విశేషాలు వివరించారు. దిల్ రాజు ఏమన్నారో ఆయన మాటల్లోనే. “సినిమా అంటేనే విజయవాడ. ఇక్కడ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను రివీల్ చేయడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారి మీద 40, 50 ఏళ్ల నుంచి మీ అభిమానం అలానే ఉంటోంది. చిరంజీవి నుంచి మనకు పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, బన్నీ, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మందిని అందించారు. ఇలా అందరికీ మెగా ఫ్యాన్ సపోర్ట్ ఉంటూనే వస్తోంది.”

“అమెరికాలో చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈవెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇక్కడకు వచ్చాను. ఆయన ఇచ్చే డేట్‌ను బట్టి ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? అనేది ఫిక్స్ అవుతాం. ఈ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు. చరిత్ర క్రియేట్ చేసేలా ఉండాలి. ఇటు వచ్చే ముందే చిరంజీవి గారికి ఫోన్ చేశాను. అప్పుడు సినిమా చూశారు కదా.. ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయింది.. మరోసారి సినిమా చూడండి అని అడిగాను.”

“వాళ్లు అక్కడ సినిమా చూడటం స్టార్ట్ చేశారు. నేను ఇక్కడకు బయల్దేరాను. ఇక్కడకు వచ్చిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఈ సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదు అని ఫ్యాన్స్‌కు చెప్పండి అని చిరంజీవి గారు అన్నారు. మెగా పవర్ స్టార్‌లో మెగాని, పవర్‌ని చూస్తారు. నాలుగేళ్ల క్రితం శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఏం ఫీల్ అయ్యానో.. చిరంజీవి గారు ఒక్కో సీన్ గురించి చెబుతూ ఉంటే అదే ఫీల్ అయ్యాను. చాలా సంతోషంగా అనిపించింది.”

“జనవరి 10న మీరు రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడబోతోన్నారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా, కొద్ది సేపు పోలీస్ ఆఫీసర్‌గా, ఇంకొద్ది సేపు రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. శంకర్ మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ఐదు పాటలు బిగ్ స్క్రీన్ మీద దేనికదే అన్నట్టుగా ఉంటుంది. 2 గంటల 45 నిమిషాలు మాత్రమే ఉండాలని నిడివి విషయంలోనూ శంకర్ గారితో మాట్లాడాను. అంతే నిడివిలో శంకర్ గారు అద్భుతంగా కట్ చేసి ఇచ్చారు.”

“సినిమా పరిగెడుతూనే ఉంటుంది. సినిమాలో అన్ని అంశాలు ఉంటూనే అన్ ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. ఎస్ జే సూర్య, రామ్ చరణ్ సీన్లతో థియేటర్లు దద్దరిల్లుతాయి. జనవరి 1న ట్రైలర్ రానుంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డేట్‌ను బట్టి జనవరి 4 లేదా 5 ఏపీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జనవరి 10న సినిమా రాబోతోంది. ఈ సంక్రాంతిని గట్టిగా సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.