ప్రధాని మోదీకి కృతజ్ణతలు తెలిపిన అక్కినేని ఫ్యామిలీ

Akkineni Family Thanks PM Modi Over His Great Words About ANR

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ‘అక్కినేని’ కుటుంబ సభ్యులు కృతజ్ణతలు తెలిపారు. ఈ మేరకు ఈ టాలీవుడ్ బడా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో నాగార్జున, ఆయన కుమారుడు, హీరో నాగచైతన్య మరియు కోడలు శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రికి థ్యాంక్స్ చెప్పారు. అయితే ఇంతకూ వీరు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలపడానికి కారణమేంటంటే..?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లెజెండరీ నటుడు, నటసామ్రాట్‌ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ఈ ఏడాది శతజయంతి జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక పతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని పలు విషయాలు పంచుకుంటారనే సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ ప్రోగ్రాంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్కినేనిపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా ఏఎన్నార్‌ తోపాటు బాలీవుడ్‌ దర్శకుడు తపన్‌ సిన్హా, దర్శక,నటుడు రాజ్‌కపూర్‌ల గురించి ప్రధాని మోదీ కొనియాడారు. “అక్కినేని.. తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలు చాలా చక్కగా చూపించేవారు. అలాగే బాలీవుడ్‌ దర్శకుడు తపన్‌ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు చేశాయి. ఇంకా బాలీవుడ్‌ దర్శక,నటుడు రాజ్‌ కపూర్‌ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారు.” అని పేర్కొన్నారు.

కాగా, వచ్చే ఏడాది మన దేశంలో మొట్టమొదటిసారిగా వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమావేశాలను నిర్వహించబోతున్నట్టు ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలపై నాగార్జున స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు. ‘‘ఐకానిక్‌ లెజెండ్స్‌తోపాటు మా నాన్న ఏఎన్నార్‌ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్నార్‌ దూరదృష్టి, ఇండియన్‌ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి’’ అని అందులో నాగార్జున పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.