టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం నుంచి ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై బజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఫిదా చేసేసింది.
గ్లోబల్ టాప్ 20 వీడియోస్ లిస్టులో స్థానం దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఈ పాటతో చాలా రీల్స్ కూడా వచ్చాయి. దీని తరువాత వచ్చిన సెకండ్ సాంగ్ ‘మీను’ కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసింది. అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ థర్డ్ సింగల్ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ రిలీజ్ చేశారు.
కాగా ఈ పాటను హీరో వెంకటేష్ స్వయంగా ఆలపించడం విశేషం. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన తొలి రెండు సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ఈ సాంగ్ కూడా అదే రేంజ్ లో ఉంది. ఈ పాటకు సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. వెంకీతో కలిసి భీమ్స్ మరియు ప్రముఖ ఫోక్ సింగర్ రోహిణి గాత్రం అందించారు. ఇక ఇందులో హీరో వెంకటేష్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కలర్ ఫుల్, సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయి.
భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పొంగల్ స్ఫూర్తిని క్యాప్చర్ చేసింది. వెంకటేష్, రోహిణి సోరట్, భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ వోకల్స్‌తో అదరగొట్టారు. భీమ్స్ DJ అవతార్ ఆలాపనతో పాట ప్రారంభమైయింది, జనవరి చలి వాతావరణం, రంగోలీల వంటి సంక్రాంతికి ముందు జరిగే ఉత్సవాలతో సీన్‌ని అద్భుతంగా సెట్ చేసింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఫ్రేమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఎనర్జీ అదిరిపోయింది.
వెంకటేష్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ ట్రాక్‌కి ఎనర్జిటిక్ టచ్‌ని యాడ్ చేసింది, వెంకటేష్, భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరట్‌లు తమ డైనమిక్ వోకల్స్ ఆకట్టుకున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతమైన పండుగ మూడ్‌కు పెర్ఫెక్ట్గా వుంది. వెంకటేష్, ఇద్దరు హీరోయిన్స్ సాంప్రదాయ వస్త్రధారణలో ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు.
ఈ పాట రూరల్ పొంగల్ వేడుకలను అందంగా ప్రజెంట్ చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పండగ ప్రాముఖ్యతను, ఐక్యత, వేడుకలను అద్భుతంగా వర్ణించింది. గ్రామీణ సంస్కృతిని వర్ణించే గ్రాండ్ సెట్, సాంగ్‌కి కలర్ ఫుల్ వైబ్‌ని యాడ్ చేసింది, పొంగల్ ఉత్సవాల్లో ఆడియన్స్‌ని ముంచెత్తుతుంది. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో కూడిన ఈ ట్రాక్ పర్ఫెక్ట్ పొగల్ సాంగ్‌గా సీజన్‌కు సరైన టోన్‌ను సెట్ చేస్తుంది.
సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా.. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























