దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో దీనిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోటితో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో రేవతి చనిపోవడం తనను కలచి వేసిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు. రాజకీయంగా కిందిస్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. తన పేరు చెప్పలేదని అల్లు అర్జున్‌ను రేవంత్ రెడ్డి అరెస్టు చేయించారని అనడం కరెక్ట్ కాదు, ఆ స్థాయిని ఎప్పుడో దాటారు. ఈ ఘటన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల క్రమంలోనే రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపై సీఎం స్పందించకపోతే ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉంది. అందుకే సీఎం హోదాలో ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.”
“రేవంత్ రెడ్డికి రామ్ చరణ్, అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచీ తెలుసు. అర్జున్ మామ కూడా కాంగ్రెస్ నేతే. కానీ కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఆయన కాబట్టే హీరో అయినా అల్లు అర్జెన్‌ను అరెస్టు చేయగలిగారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు, చట్టం అందరికీ సమానం. బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అరెస్ట్ చేస్తారు. తెలుగు పరిశ్రమకు రేవంత్ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోంది. పుష్ప 2కి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపుకి అనుమతి ఇవ్వడం సినిమాలను ప్రోత్సహించడమే.”
“అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపించిందనిపించింది. అల్లు అర్జున్ తరపున రేవతి ఇంటికి ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది. ఆ కుటుంబానికి మేమున్నాం అనే భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. అప్పుడు ఇంత రచ్చ అవకుండా ఉండేది. గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది నా అభిప్రాయం. అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో నాకు సరిగా తెలియదు.”
“మేము సినిమా థియేటర్‌కు వెళ్లడం ఎప్పుడో మానేశాము. ఒకప్పుడు చిరంజీవి కూడా ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు. నేనూ అలాగే వెళ్లిన సందర్భాలున్నాయి. కళాకారులకు ఒక పొగడ్త, అవార్డు అనేది వెలకట్టలేనిది. ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు. సాధారణంగా ఎవరైనా నటుడు బయటకు వచ్చినప్పుడు ప్రజలకు అభివాదం చేయకపోతే.. అతనిపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. “
“ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పు పట్టను, ఎందుకంటే? ఫస్ట్ వారు ప్రజల భద్రత గురించి ఆలోచన చేస్తారు. విజయనగరంలో నాకు కూడా ముందు వద్దనే చెప్పారు. ఈ విషయంలో స్టాఫ్ అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్లి కూర్చున్నాక.. ఘటన గురించి తెలిపి బయటకు తీసుకెళ్లాల్సింది. అర్జున్‌కు చెప్పి ఉన్నా ఒకవేళ ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో. ఈ ఘటనలో నా వల్ల ఒక వ్యక్తి చనిపోయారనే వేదన అర్జున్‌లో కూడా ఉంటుంది. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం.” కాగా ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖలు వైరల్ అవుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























