సుహాస్ ‘ఓ భామ అయ్యో రామా’ గ్లింప్స్ రిలీజ్

Suhas Starrer Oh Bhama Ayyo Rama Glimpse Released

సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ గోదాల దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మనోజ్ తనకు జంటగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్ర గ్లింప్స్ వీడియో విషయానికి వస్తే ఈ చిత్రంలోని హీరో హీరోయిన్ ఒక కారులో ఒకరిని ఒకరు టీస్ చేసుకుంటూ సరదాగా ఉన్న సమయంలో కార్ బ్రేకులు పనిచేయక ఆ పరిస్థితి మారిపోయి మరో దిశగా పరిస్థితులు వెళ్తుంటాయి.

వి ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మాతగా గొప్ప నిర్మాణ విలువలతో రానున్న ఈ చిత్రంలో ‘నువ్వు నేను’ ఫేమ్ అనితా హస్సానందని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కామెడీ పండించడానికి ప్రభాస్ శ్రీను, ఆలీ నటిస్తుండగా.. ఇటీవల ‘యానిమల్’ సినిమాలో కనిపించిన నటుడు బబ్లూ పృథ్వీ రాజ్‌ ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నారు.

ఇక ఇందులో అనిత హస్సానందని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రథన్ సంగీతాన్ని అందిస్తుండగా.. మణికంఠం ఎస్ సినిమాటోగ్రఫీ, భవిన్ షా ఎడిటింగ్ చేస్తున్నారు. వీరితోపాటు మరికొందరు అనుభవజ్ఞులు ఈ చిత్రానికి సాంకేత బృందంగా వ్యవహరిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.