ఆల్ టైం టాప్ 3 లో దోప్ సాంగ్

Dhope song gets record views in 24hrs

సంక్రాంతి మచ్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ నుండి వస్తున్న సాంగ్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి.ఇప్పటివరకు ఈసినిమా నుండి నాలుగు పాటలు రిలీజ్ కాగా ఇందులో రెండు పాటలు 24గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన లిరికల్ వీడియోల జాబితాలో ఆల్ టైం టాప్ 3లో స్థానం దక్కించుకున్నాయి.అందులో భాగంగా గేమ్ ఛేంజర్ మూడో పాటగా వచ్చిన నానా హైరానా 23.44 మిలియన్ల వ్యూస్ తో రెండో స్థానంలో ఉండగా నిన్న విడుదలైన దోప్ సాంగ్ 21.27 మిలియన్ల వ్యూస్ తో మూడో స్థానం కైవసం చేసుకుంది.27.19 మిలియన్ల వ్యూస్ తో పుష్ప 2 కిస్సిక్ సాంగ్ మొదటి స్థానంలో వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ చరణ్ స్టెప్స్ తమన్ ఇచ్చిన బీట్స్ దోప్ సాంగ్ ను చార్ట్ బాస్టర్ చేశాయి.సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా యూఎస్ఏ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఈవెంట్ ను చేయనున్నారు.అన్ని కుదిరితే వచ్చే వారం ట్రైలర్ ను కూడా వదలనున్నారు.

శంకర్ డైరెక్షన్ లో సోషల్ మెసేజ్ తో వస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో నటించగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.అంజలి ,ఎస్ జె సూర్య ,శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.జనవరి 10న గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.