గేమ్ చేంజర్‌తో రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు పక్కా

Director Sukumar Wish Ram Charan Will Get National Award This Time For Game Changer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ మాట్లాడుతూ గేమ్ చేంజర్‌తో రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు రావడం పక్కా అని అన్నారు. సుకుమార్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ఓవర్సీస్ ఆడియెన్స్ తెలుగు సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తుంటారు. వన్ నేనొక్కడినే మూవీని ఇక్కడి ఆడియెన్స్ ఆదరించి ఉండకపోతే నాకు నెక్ట్స్ సినిమాలు వచ్చేవి కావు. దిల్ రాజు గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. నన్ను నిలబెట్టినందుకు దిల్ రాజు గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.”

“శంకర్ గారి చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నాను. చిరంజీవి గారు ఎందుకు శంకర్ గారితో సినిమా చేయలేదు.. శంకర్ గారు ఎందుకు తెలుగు సినిమా చేయడం లేదు? అని అనుకునేవాళ్లం. కానీ శంకర్ గారితో రామ్ చరణ్ సినిమా అని తెలియడంతో తెగ ఆనంద పడ్డాను. ఈ విషయాన్ని రామ్ చరణ్ మొదటగా నాకే చెప్పినట్టున్నాడు. సూర్య తీసిన ‘ఖుషి’ నాకు చాలా ఇష్టం. రైటర్‌గా వచ్చి డైరెక్టర్‌గా చేశా. ఖుషి సినిమాను రిఫరెన్సుగా పెట్టుకున్నాను. అంజలి మా ఊరు అమ్మాయి. చాలా బాగా నటించారు.”

“నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమన్ సాయం చేశాడు. కానీ అది నేను వాడుకోలేకపోయాను. ఓ హీరోతో సినిమా చేసినప్పుడు ఆ హీరోని ఎక్కువగా ప్రేమిస్తాను. రంగస్థలం అయిపోయాక కూడా ఆ అనుబంధం రామ్ చరణ్‌తో మాత్రమే కొనసాగింది. రామ్ చరణ్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాను. చిరంజీవి గారితో కలిసే ఈ గేమ్ చేంజర్ చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం.. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్.. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్, ఫినామినల్.”

“అప్పట్లో శంకర్ గారు తీసిన ‘జెంటిల్మెన్, భారతీయుడు’ చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో.. గేమ్ చేంజర్ చూస్తూ మళ్లీ అంతే ఎంజాయ్ చేశాను. రంగస్థలం తరువాత రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ రాలేదు. అయితే ఈసారి గేమ్ చేంజర్‌ క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుంది” అని అన్నారు డైరెక్టర్ సుకుమార్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.