బచ్చల మల్లి కంటెంట్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది

Bachhala Malli Content Looks Like Very Promising, Says Actress Samyuktha Menon

హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్త ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. వీరితోపాటు దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, వశిష్ట, విజయ్ కనకమేడల, యదు వంశీ, కార్తిక్ వర్మ దండు, బలగం వేణు అతిధులు పాల్గొన్నారు. అలాగే సినిమా టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. “ఒక మంచి మూవీని సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. నేను ప్రతి సినిమాని ఫాలో అవుతాను. ఈ సినిమాలో ప్రతి కంటెంట్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సినిమా కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. రాజేష్ గారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా ఎక్సైటెడ్‌గా చెప్తుండేవారు.” అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఈ సినిమాతో నరేష్ గారు బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను. అమృత హనుమాన్ తో మంచి విజయాన్ని అందుకుంది. బచ్చల మల్లితో అది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. మనం సినిమాని ఒక ప్యాషన్ తో తీస్తే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.