హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్త ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. వీరితోపాటు దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, వశిష్ట, విజయ్ కనకమేడల, యదు వంశీ, కార్తిక్ వర్మ దండు, బలగం వేణు అతిధులు పాల్గొన్నారు. అలాగే సినిమా టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం అల్లరి నరేష్‌తో తనకు గల అనుబంధాన్ని పంచుకున్నారు. కిరణ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ఇంతమంది ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. రాజేష్ గారు సినిమాపై ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయనతో ట్రావెల్ అవుతున్నప్పుడు సినిమా పట్ల ఆయనకున్న ఇష్టం అర్ధమైయింది. ఈ చిత్రం మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కంగ్రాట్స్.”
“ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా కోసం అమృత అయ్యర్‌ను సంప్రదించాం. కానీ ఆమె నుంచి రిప్లై రాలేదు (నవ్వుతూ). నేను తొలిసారి కలిసిన హీరో అల్లరి నరేష్. కాలేజీ రోజుల్లో విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఆయన సినిమా షూటింగ్ జరిగింది. ఎస్ఆర్ కళ్యాణ మండపంకు నరేష్ అన్న సపోర్ట్ చేశారు. ఆయన అంటే చాలా ఇష్టం. ఈ వేడుకలో ఆయన పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది.”
“ఇప్పటివరకూ తన సినీ కెరీర్లో ఎన్నో డిఫరెంట్ రోల్స్ ప్లే చేసిన నరేష్ అన్నకు స్టార్ ట్యాగ్ ఎందుకు రాలేదని సుబ్బు అన్నని అడిగా. ఆయన చేసిన రోల్స్ చాలా గొప్పవి. ఓ నటుడు అన్ని వేరియేషన్స్ చూపించడం కష్టం. ఆయనకు ఇష్టమో లేదో తెలియదుగానీ స్టార్ ట్యాగ్ ఇవ్వాలని ఓ ఫ్యాన్‌గా కోరుకుంటున్నా. ‘బచ్చలమల్లి’ ట్రైలర్ చూడగానే నచ్చేసింది. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























