గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కు నెక్ట్స్ రేంజ్‌లో ఉండేలా డైరెక్టర్ శంకర్ సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి వచ్చిన మూడు పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ‘జరగండి, రా మచ్చా, నానా హైరానా’ పాటలు యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి.
మరోసారి శ్రోతల్ని, అభిమానుల్ని కట్టి పడేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు తదుపరి పాటకు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసింది. కాగా ఈరోజు ప్రొడ్యూసర్ దిల్ రాజు జన్మదినం సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ ఆయనకు విషెస్ తెలియజేస్తూ ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది. మొత్తానికి ప్రోమో అయితే ఆకట్టుకుంటోంది.
ఇక ఈ ప్రోమోను చూస్తే ఈ పాటను ఏ రేంజ్‌లో శంకర్ పిక్చరైజేషన్ చేశారో అర్థం అవుతోంది. తమన్ ఇచ్చిన బీట్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ అత్యద్భుతంగా వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనిపిస్తోంది. ఈ పాటకు తమిళంలో వివేక్, హిందీలో రక్వీబ్ ఆలం సాహిత్యాన్ని అందించారు.
తెలుగులో ఈ పాటను తమన్ ఎస్, రోషిణి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించాగా.. తమిళంలో తమన్ ఎస్, అదితీ శంకర్, పృథ్వీ.. హిందీలో తమన్ ఎస్, రాజకుమారి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించారు. పూర్తి పాటను డల్లాస్ ఈవెంట్‌లో డిసెంబర్ 21న రాత్రి 9 గంటలకు రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇండియాలో ఈ పాట డిసెంబర్ 22న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఇక ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ హాజరవుతుండటం గమనార్హం.
కాగా గేమ్ ఛేంజర్‌కు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ అందిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా అన్బరివు, డాన్స్ డైరెక్టర్‌గా ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వర్క్ చేస్తున్నారు. రామ్ జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ పాటలను రాశారు.
సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున రిలీజ్ చేయనుంది. అలాగే ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా.. హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























