పాన్ ఇండియా రెబల్ స్టార్, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌కు గాయమైంది. ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణలో ఆయన గాయపడ్డట్టు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశం షూటింగ్‌లో భాగంగా ప్రభాస్ కాలికి గాయమైంది. దీంతో ప్రభాస్ ఆస్పత్రికి వెళ్లగా.. కాలి చీలమండ కింద బెణికినట్టు వైద్యులు నిర్ధారించారు. వారి సూచన మేరకు ఆయన కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలావుంటే, మరోవైపు ‘కల్కి 2898 AD’ సినిమా జనవరి 3న జపాన్‌లో రిలీజవుతున్న నేపథ్యంలో మేకర్స్ అక్కడ భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరుణంలో ప్రభాస్ గాయం కారణంగా అక్కడికి వెళ్లడం లేదని సమాచారం. ఇక తమ అభిమాన నటుడు ప్రభాస్ గాయపడ్డారనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పైన ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫౌజీ’ షూటింగ్ జరుగుతుండగా.. డ్రాగన్ ప్రకాశ్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగే మరో చోట రాజాసాబ్ చిత్రీకరణ జరుగుతుండగా.. రామ్-లక్ష్మణ్‌ల నేతృత్వంలో ‘రాజాసాబ్’ లో హీరోలేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఆయనకు ఏ షూటింగ్‌లో గాయమైందనేది తెలియాల్సి ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























