హీరో అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ మునుపెన్నడూ చూడని రగ్గడ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ రస్టిక్ యాక్షన్ డ్రామా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. టీజర్ భారీ అంచనాలను సృష్టించగా, ట్రైలర్ ఆ అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ సందర్భంగా హీరో నాని, అల్లరి నరేష్ మరియు చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
హీరో నాని ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. ఈ సినిమా టీజర్ చూసి నరేష్‌కి ఫోన్ చేశాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలనే ఉందని చెప్పాను. సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోయింది, అది బ్లాక్ బస్టరా, ఏ రేంజ్ అనేది టైం డిసైడ్ చేస్తుందని చెప్పాను. నాకు నేనుగా ఈవెంట్‌కి వచ్చాను. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి.”
“నరేష్ హిట్ కొడతాడనే నమ్మకం ఆడియన్స్‌లో కూడా వచ్చేసింది. సుబ్బు నా ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్. ‘మజ్ను’ సినిమా చేస్తున్నప్పుడు తను నా వన్ మేన్ ఆర్మీ. ఏ అవసరం ఉన్నా తననే అడిగేవాణ్ణి. ఆ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ తనది కూడా. అప్పుడే తను డైరెక్ట్ అయిపోతాడని చెప్పాను. తన జర్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది.”
“బచ్చల మల్లి చూసినప్పుడు సుబ్బుకి తన బలం దొరికిందని అనిపించింది. సుబ్బు బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్‌కి బెస్ట్ విషెస్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ నా ఫేవరెట్. ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ నా ఫేవరెట్ ఫిలిం. దానికి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో మ్యూజిక్‌కి చాలా డెప్త్ ఉంది.”
“సుబ్బు ట్రైలర్ లోనే కథ చెప్పాలనుకున్నాడు అంటే సినిమాలో ఇంకెంత హానెస్ట్గా ప్రయత్నించి ఉంటాడో నేను ఊహించగలను. అమృత ఆల్ ది వెరీ బెస్ట్. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ క్రిస్మస్ మనదే. ఈ డిసెంబర్లో పుష్ప 2 ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఈ డిసెంబర్‌ని బచ్చలమల్లి సక్సెస్‌తో మంచి డెసర్ట్‌గా ఎండ్ చేస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























