శివకార్తికేయన్ 25వ సినిమా అనౌన్స్‌మెంట్

Sivakarthikeyan’s Milestone Movie SK25 with Sudha Kongara Launched

కోలీవుడ్ స్టార్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ ఇటీవలే ‘అమరన్’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగరతో కొలాబరేట్ అవుతున్నారు. కాగా ఇది ఆయనకు మైల్ స్టోన్ 25వ మూవీ కావడం విశేషం. ఇక ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీలో జయం రవి, అథర్వ, శ్రీలీల కీ రోల్స్ పోషించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ బాస్కరన్ గ్రాండ్ గా నిర్మించనున్నారు. ఈ మచ్ అవైటెడ్ మూవీని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ప్రతిష్టాత్మకగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చనున్నారు. అయితే ఈ చిత్రం G.V. ప్రకాష్‌కి 100వ సినిమా కావడం మరింత ప్రత్యేకం.

ఈ సందర్భంగా నిర్మాత ఆకాష్ బాస్కరన్ మాట్లాడుతూ.. “మా ప్రొడక్షన్ నెం.2 చిత్రాన్ని తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రతిభావంతుడైన హీరో శివకార్తికేయన్ తో గ్రాండ్ గా నిర్మిస్తునందుకు ఆనందంగా వుంది. శివకార్తికేయన్ 25వ చిత్రాన్ని నిర్మించడం మాకు గొప్ప సంతోషాన్ని ఇస్తోంది. ఈ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ జాతీయ అవార్డు-విన్నర్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అత్యంత భారీ అంచనాల చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది”. అని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.