వైవిధ్యమైన ప్రాతలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీకి ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్’ (శివ మనసులో శృతి) సినిమాలతో విభిన్న చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఆదివారం (డిసెంబర్ 15), లావణ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఆమెకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసింది.
‘సతీ లీలావతి’ చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్, ఎగ్జయిటింగ్ కథాంశంతో మెప్పించటానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా, బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా.. కోసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్‌గా, సతీష్ సూర్య ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























