రాబిన్‌హుడ్ రిలీజ్ వాయిదా

Nithiin and Sreeleela's Robinhood Release Postponed

యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే, ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్ సహా అన్ని ప్రచార చిత్రాలకి మూవీ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవలే చిల్డ్రన్స్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా మంచి స్పందన అందుకుంది. మరోవైపు మేకర్స్ ఇప్పటికే రాబిన్‌హుడ్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారభించేశారు.

దీనిలో భాగంగా రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ ‘వన్ మోర్ టైం’ సాంగ్ ని రిలీజ్ చేయగా మంచి మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక త్వరలోనే ఈ మూవీ నుండి ‘అది దా సర్‌ప్రైజ్’ అనే సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాబిన్‌హుడ్ రిలీజ్ వాయిదా పడింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఈ మేరకు నేడు సోషల్ మీడియా వేదికగా టీమ్ ప్రకటించింది. అయితే వాస్తవానికి ముందుగా నిర్ణయించిన ప్రకారం, ఈ ఎంటర్‌టైనింగ్ అడ్వంచర్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వలన ఈ చిత్రం విడుదల ఆలస్యం అయింది. ఈ తరుణంలోనే మేకర్స్ రాబిన్‌హుడ్ మూవీని పోస్ట్ పోన్ చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.