తమిళ హీరో విజయ్ సేతుపతి టైటిల్ లో నటించిన సినిమా మహారాజ.ఈఏడాది కోలీవుడ్ బిగెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది ఈసినిమా.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా.థియేట్రికల్ రన్ తరువాత ఓటిటిలోకి వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈసినిమాతో విజయ్ సేతుపతి మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నిన్న చైనా లో విడుదలైయింది. ఏకంగా 40000 స్క్రీన్ లలో గ్రాండ్ గా రిలీజ్ కాగా మొదటి రోజు అలాగే ఈరోజు బుకింగ్స్ తో కలుపుకుని మన కరెన్సీ ప్రకారం 14కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుందని సమాచారం.ఇంతకుముందు ఇండియన్ మూవీ దంగల్ అక్కడ రిలీజై 1000కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్. మరి మహారాజా ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
నిథిలిన్ స్వామి నాథన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అనురాగ్ కశ్యప్,మమతా మోహన్ దాస్,అభిరామి కీలక పాత్రల్లో నటించారు.అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.దాదాపు 20కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈసినిమా ఊహించని లాభాలను తీసుకొచ్చింది.ఇక ఈసినిమా తరువాత విజయ్ సేతుపతి నెక్స్ట్ విడుతలై 2 తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.వెట్రిమారన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా విజయ్ సేతుపతి,సూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























