నటి సమంత ఇంట తీవ్ర విషాదం

Actress Samantha Father Joseph Prabhu Passed Away

ప్రముఖ నటి సమంత ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ మేరకు విషయాన్ని సమంత స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ స్టేటస్‌ను పోస్ట్ చేసి దానికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు సానుభూతిని తెలియజేస్తూ ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. అయితే జోసెఫ్ ప్రభు మరణవార్తకు కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా సమంత చెన్నైకి చెందిన జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో-ఇండియన్. తన జీవితంలో తండ్రి ముఖ్య పాత్ర పోషించారని పలు ఇంటర్వ్యూలలో సమంత చెప్పారు. తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా, మద్దతుగా నిలిచారని, తన ఎదుగుదలలో ఆయన సపోర్ట్ ఎంతో ఉందని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.