కోలీవుడ్ విలక్షణ నటుడు, ‘మక్కళ్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. తమిళనాడులో రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి విజయ్ సేతుపతి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని చూసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ హీరో దళపతి విజయ్ చిత్ర దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీని మెచ్చుకున్నారు. ఇక జులై 12న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా తన హవా చూపిస్తూ రికార్డు వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
ఈ నేపథ్యంలో ఇండియాలో రికార్డులు సృష్టించిన మహారాజ చైనాలో నేడు గ్రాండ్‌గా విడుదలవుతోంది. భారీ స్థాయిలో 40 వేలకుపైగా స్క్రీన్స్‌లలో విడుదలవుతున్న మహారాజ చైనీస్ భాషలో సందడి చేయనుంది. కాగా చైనా ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ Yi Shi Films అలీబాబా పిక్చర్స్ భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమాపై అక్కడ కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలో ‘అమరన్’ ఫేమ్ శివకార్తికేయన్ దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ చేయగా, అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. మహారాజ చైనాలో రిలీజ్ అవుతుండటం మనందరికీ గర్వకారణంగా పేర్కొన్న ఆయన, ఈ చిత్రం ఇండియాలో వలే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివకార్తికేయన్, మహారాజ హీరో విజయ్ సేతుపతి, డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ సహా ఇతర చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























