నాగచైతన్య బర్త్ డే.. కొత్త సినిమా ప్రకటించిన సుకుమార్

Director Sukumar Announced NC24 on Yuva Samrat Naga Chaitanya's Birthday

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈరోజు చైతన్య జన్మదినం సందర్భంగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్‌ లుక్‌ని విడుద‌ల చేశారు. ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన హోం బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ మరియు ఎస్‌వీసీసీ బ్యానర్స్‌పై నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్‌సీ24 (#NC24) వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్న ఈ మూవీకి సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో ‘విరుపాక్ష’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ కొట్టిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించనున్నారు. మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు మరియు పనిచేయనున్న సాంకేతికవర్గం వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా సుకుమార్, చైతూ కాంబోలో ఇంతకుముందు ‘100% లవ్’ అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇదిలావుంటే, నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో చైతూ మత్స్యకారుడిగా కనిపించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే రిలీజైన ఫస్ట్ సింగల్ ‘బుజ్జి తల్లి’ మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేస్తోంది. ఫిబ్రవరి 7న తండేల్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో నాగచైతన్య ఇంతకుముందెన్నడూ కనిపించని పాత్రలో కనిపిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.