మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉన్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ తాజాగా ప్రారంభమయింది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్‌లను స్క్రీన్స్ పైకి తీసుకువచ్చింది. దీంతో ఇది పాన్ ఇండియా మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. కాగా ఈ చిత్రంలో ఈ ఇద్దరు లెజెండ్స్‌తో పాటు మరికొందరు స్టార్ తారాగణం భాగం అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా.. మరో స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కుంచాకో బోబన్ , నయనతార, రాంజీ పనికర్, రాజీవ్ మీనన్, డానిష్ హుస్సేన్, షాహీన్ సిద్ధిక్, సనల్ అమన్, రేవతి, దర్శన రాజేంద్రన్, సెరీన్ షిహాబ్, ప్రకాష్ బెలవాడి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
సూపర్ స్టార్ మోహన్ లాల్ జ్యోతి ప్రజ్వలనతో అధికారికంగా ప్రారంభమైంది. సహ నిర్మాతలు సుభాష్ జార్జ్ మాన్యువల్ స్విచ్ ఆన్ చేయగా, సి.ఆర్.సలీం తొలి క్లాప్ ఇచ్చారు. మోహన్‌లాల్‌తో పాటు, రాజేష్ కృష్ణ, సలీం షార్జా, అనురా మథాయ్, తేజస్ థంపి దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్‌బైజాన్, థాయ్‌లాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ , కొచ్చితో సహా పలు లొకేషన్‌లలో 150 రోజుల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు.
సహ నిర్మాతలు సి.ఆర్.సలీం, సుభాష్ జార్జ్ మాన్యుయెల్‌లతో కలిసి ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ నారాయణన్ కథ అందించారు. రాజేష్ కృష్ణ, సి.వి. సారథి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. రాంజీ పనికర్, రాజీవ్ మీనన్, డానిష్ హుస్సేన్, షాహీన్ సిద్ధిక్, సనల్ అమన్, రేవతి, దర్శన రాజేంద్రన్, సెరీన్ షిహాబ్, మద్రాస్ కేఫ్, పఠాన్ సినిమాలలో అలరించిన ఆర్టిస్ట్-డైరెక్టర్ ప్రకాష్ బెలవాడి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అలాగే ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ జోసెఫ్ నెల్లికల్, మేకప్ రంజిత్ అంబాడి, కాస్ట్యూమ్స్ ధన్య బాలకృష్ణన్, ప్రొడక్షన్ కంట్రోల్ డిక్సన్ పొడుతాస్. లీను ఆంటోని చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా, ఫాంటమ్ ప్రవీణ్ అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ANN మెగా మీడియా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































