విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాతికి వస్తున్నాం’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పటికే 90% షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ గ్రిప్పింగ్ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కనిపించనుంది. తాజాగా టీమ్ డబ్బింగ్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. కాగా ఈ పాటను పాపులర్ మ్యూజిక్ కంపోజర్ రమణ గోగుల పాడనుండటం విశేషం.
ఈ నేపథ్యంలో సంక్రాతికి వస్తున్నాం సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాత దిల్ రాజు బుధవారం అధికారిక ప్రకటన చేశారు. మూవీ టైటిల్ లోనే సంక్రాంతి అని ఉండటంతో తప్పనిసరిగా ఈ పండుగ సమయంలోనే రిలీజ్ చేయాల్సివుంటుంది. అందుకే సినిమాల రిలీజ్ పరంగా అతి పెద్ద సీజన్ అయిన పొంగల్ బరిలోకి దిగుతోంది ఈ చిత్రం.
ఇక ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌కు అత్యున్నత సాంకేతికవర్గం సహకారం అందిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. అలాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
కాగా వెంకీ, అనిల్, దిల్ రాజు కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ హ్యాట్రిక్ మూవీగా రాబోతోంది. దీంతో ఈ చిత్రంపై వెంకీ అభిమానులతోపాటుగా మూవీ లవర్స్ అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి.
అయితే మరోవైపు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమాలు కూడా పండగ బరిలోకి వస్తుండటంతో ఈసారి సంక్రాంతి పోటీ గట్టిగానే ఉండనుంది. ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10వ తేదీన విడుదలవుతుండగా.. డాకు మహారాజ్ జనవరి 12న రిలీజ్ కానుంది. అయితే గేమ్ ఛేంజర్ సినిమాకు కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజే అన్న విషయం తెలిసిందే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































