రామ్ పోతినేని 22 లాంచ్ డేట్ ఫిక్స్

The launch date for RAPO 22 has been confirmed

యంగ్ హీరో రామ్ పోతినేని రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ తో వచ్చి హిట్ కొట్టలేకపోయాడు.తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కింది డబుల్ ఇస్మార్ట్. దాంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా ఓపెనింగ్స్ ను అయితే రాబట్టుకుంది కానీ ఆతరువాత నిలువలేకపోయింది.ఇక ఈసినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న రామ్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కి రెడీ అవుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నవీన్ పోలిశెట్టి ,అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తెరకెక్కించి మొదటి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ మహేష్ బాబు.ఈసినిమాకు అవార్డులు కూడా దక్కాయి.ఇక ఇప్పుడు మహేష్ బాబు, రామ్ నెక్స్ట్ మూవీ ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈసినిమా ఈనెల 22న లాంచ్ కానుంది.ఈసందర్భంగా విడుదలచేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.అందులో రామ్ సైకిల్ తో వెళ్తూ కనిపించాడు.ఫ్రెష్ సబెక్టు తో ఈసినిమా రానుంది.

గత కొన్ని ఏళ్ల నుండి రామ్ కు సరైన హిట్ పడలేదు.దాంతో ఫ్యాన్స్ ఈసినిమాతో రామ్ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు.మరి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో బడా నిర్మాణ సంస్థ లో చేస్తున్న ఈసినిమాతో నైనా రామ్ హిట్ కొడతాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.