కుబేర.. నాగ్ న్యూ పోస్టర్ అదిరింది

Kubera King Nagarjuna’s Brand New Poster Creates Curiosity

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇంకా నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ నెల 15న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. కుబేర నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్, నాగార్జు, రష్మిక మందన్న క్యారెక్టర్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కుబేర షూటింగ్ పూర్తి కావొస్తోంది. పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పటికే జరుగుతోంది. ఫస్ట్ గ్లింప్స్ తో పూర్తి స్వింగ్‌లో ప్రమోషన్స్ ని బిగెన్ చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున బ్రాండ్ న్యూ పోస్టర్ ఒకటి విడుదల చేసింది చిత్ర యూనిట్.

కాగా ఈ పోస్టర్ మెలాంకోలిక్ లైట్‌లో ప్రజెంట్ చేస్తూ, క్యారెక్టర్ ఎమోషనల్ డెప్త్ పై అందరిలో ఆసక్తిని పెంచింది. క్యూరియాసిటీ క్రియేట్ చేసిన పోస్టర్‌లో నాగార్జున ఖరీదైన సోఫాలో కూర్చుని ఆలోచిస్తున్నట్లు కనిపించారు. అతని చుట్టూ సంపద ఉన్నప్పటికీ, అతని కళ్ళలోని ఎమోషన్ ఒక కాంప్లీకేట్ లైఫ్ ని చూపిస్తున్నాయి.

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న కుబేర సస్పెన్స్ ఎలిమెంట్స్ తో గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్‌. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా కుబేర తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.

అయితే సమాజంలోని ఆర్థిక అసమానతలను ఆవిష్కరిస్తూ, ధనం పట్ల లోకం వ్యవహరించే తీరుపై అంతర్లీనంగా సందేశం ప్రధానాంశంగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. కాగా ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.