కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డ్యూయల్ రోల్స్‌లో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువా’. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే కంగువా నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్ వీడియో, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కంగువా మూవీ ట్రైలర్ కూడా ఇటీవలే రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌లో చూపించని మరికొన్ని సీన్స్ ఇందులో కనిపించాయి. కాగా కంగువ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో 3డీ వర్షెన్ సహా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది చిత్ర యూనిట్. ఈ మూవీ కోసం నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకుంటున్న థియేటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు నేడు సోషల్ మీడియాలో వెల్లడించింది. సో మూవీ లవర్స్.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లిస్టును ఓసారి చూసి మీకు దగ్గరలోని థియేటర్లో కంగువాను వీక్షించే అవకాశాన్ని పొందండి.
కాగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతుండగా.. ఓవర్సీస్ రైట్స్‌ను ‘ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సంస్థ దక్కించుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























