పుష్ప 2 నుండి వరుసగా అప్డేట్లు

a series of updates coming from pushpa 2

ఈఏడాది చివర్లో బాక్సాఫీస్ ను షేక్ చేయనుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2.ఈసినిమాపై నేషన్ వైడ్ గా భారీ అంచనాలు వున్నాయి.వచ్చే వారంలో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఓ స్పెషల్ సాంగ్ ను కూడా చిత్రీకరించాల్సి వుంది.ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా చేయని ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది పుష్ప 2. థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ కలిపి 1000కోట్లకు పైనే బిజినెస్ జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఈ నెలలో వరస అప్డేట్లు రానున్నాయని సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది.ట్రైలర్ తోపాటు ,సాంగ్స్ , భారీ ఈవెంట్లు ఇలా నెల పాటు పుష్ప 2 జాతర కొనసాగనుంది.సుకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.

ఇక అల్లు అర్జున్ ఈసినిమా తరువాత త్రివిక్రమ్ తో సినిమాను మొదలు పెట్టనున్నాడు.ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ఇంతకుముందు ఎవరు టచ్ చేయని పాయింట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.వచ్చే ఏడాది సెట్స్ మీదకు రానుంది. కుదిరితే ఫిబ్రవరి లో మొదలుపెట్టనున్నారు.త్రివిక్రమ్ -అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా.ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన జులాయి,సన్ ఆఫ్ సత్యమూర్తి ,అల వైకుంఠపురములో బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.