క నుండి ‘ఓ బుజ్జమ్మాయి’ సాంగ్ రిలీజ్

Bujjaama Lyrical Video Released From Kiran Abbavaram's KA

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌’క’ సినిమాను రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‘క’ సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్‌పై రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ‌క మూవీ ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో విషయం ఉందని దీనితో ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చారు.

అలాగే ఇంతకుముందు రిలీజ్ చేసిన లిరికల్ వీడియో సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా క సినిమా నుంచి ‘ఓ బుజ్జమ్మాయి’ అనే సాంగ్‌ను విడుదలచేశారు మేకర్స్. ఇక ఈ పాటకు సనాపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం, గాయకుడు శరత్ సంతోష్ గాత్రం అందించారు. వినసొంపుగా ఉన్న ఈ సాంగ్‌కు సామ్ సీఎస్ సంగీతం సమకూర్చారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.