SSMB29.. లొకేషన్స్ వేటలో రాజమౌళి

Maverick Director SS Rajamouli Scouting Locations in Kenya, Africa For SSMB29

మావెరిక్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్‌ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. హీరో మహేష్ బాబు కూడా ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. తనకున్న గ్లామర్‌తో పాటు క్యారక్టర్ ప్రకారం ఫిట్‌గా కనిపించేందుకు జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ చిత్రం అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్‍డ్రాప్‍లో, ట్రెజర్ హంట్ నేపథ్యంలో యాక్షన్ ఎడ్వెంచరస్‌గా రూపొందనున్నట్టు ఇప్పటికే రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించడం తెలిసిందే. ఇక తన విజన్‌కి తగ్గట్టు ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దే రాజమౌళి ఈ సినిమాలో ఇంతకుముందెన్నడూ చిత్రీకరించని లొకేషన్స్‌లో షూటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళి సినిమా లొకేషన్స్ వేటలో పడ్డారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఆయన వన్యప్రాణులు, క్రూరమృగాలు తిరుగాడే కెన్యా, ఆఫ్రికా దేశాల్లోని అడవులు, ఎడారుల్లో అన్వేషిస్తున్నారు. ఈమేరకు ఆయన అక్కడి నేషనల్ పార్కుల్లో స్పెషల్ వాహనంలో లొకేషన్స్ సెర్చింగ్ చేస్తున్నారు. ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఎవరూ చూపించని విధంగా దీనిని తెరకెక్కించడానికి పూనుకున్నారు.

ఇదిలావుంటే, మరోవైపు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అంశం వారిని ఎక్సయిట్ చేస్తోంది. ఈ క్రమంలో రాజమౌళి లొకేషన్స్ సెర్చింగ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో మహేష్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన నేపథ్యంలో.. SSMB29 మూవీపై వరల్డ్ రేంజ్‌లో భారీ అంచనాలున్నాయి. దీంతో దర్శకధీరుడు ఈ సినిమాను హాలీవుడ్ చిత్రాల స్థాయిలో తెరకెక్కించడంతోపాటు గ్లోబల్ వైడ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం దాదాపు 1,000 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించనున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.