ఘనంగా ఏఎన్నార్ అవార్డు వేడుక.. సందడి చేసిన చైతూ-శోభిత

Naga Chaitanya and Sobhita Shines at ANR National Awards Event

ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే అందరిలోకీ ఓ జంట ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఈ అవార్డుల వేడుకలో తళుక్కుమన్నారు. వీరిని నాగార్జున అమితాబ్ మరియు చిరంజీవిలకు ప్రత్యేకంగా పరిచయం చేయడం విశేషం. ఇప్పటికే నిశ్చితార్ధమైన నేపథ్యంలో త్వరలోనే వీరిరువురు మూడుముళ్ల బంధంతో ఒక్కటికాబోతున్నారు. ఈ క్రమంలో చైతూ-శోభిత జంట ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఇక హీరోలు వెంకటేష్, రామ్ చరణ్, నాని, సిద్దు జొన్నలగడ్డ, సుధీర్ బాబు, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్, చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, శ్యాం ప్రసాద్ రెడ్డి, టీజీ విశ్వప్రసాద్, సునీల్ నారంగ్, స్వప్న దత్, హీరోయిన్స్ రమ్యకృష్ణ, శ్రీలీల, నటులు ప్రకాష్ రాజ్, మురళిమోహన్, అలీ, రాజేంద్రప్రసాద్, రైటర్ విజయేంద్రప్రసాద్, అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకు మహా అద్భుతంగా జరిగింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.