గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి రీసెంట్ గా వచ్చిన సెకండ్ సింగిల్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఫ్యాన్స్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.అయితే ఈ టీజర్ కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇప్పటికే కట్ కూడా జరిగిపోయిందని సమాచారం.నిన్న గేమ్ ఛేంజర్ లోని కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ టీజర్ సూన్ అని వేశారు.అన్ని కుదిరితే ఈ దీపావళికి టీజర్ ను దింపనున్నారు.నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది.గేట్ ముందు టేబుల్ వేసుకొని చరణ్ కుర్చీ లో కూర్చొని ఉండగా రౌడీలు తన మీదకు వస్తున్నట్లుగా ఆ పోస్టర్ లో వుంది.మొత్తానికి ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాకు హైప్ పెంచుతుంది టీం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ నటిస్తుండగా ఎస్ జె సూర్య,శ్రీకాంత్, శ్యామ్,అంజలి కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది జనవరి 10న గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రానుంది.
ఇక గేమ్ ఛేంజర్ షూటింగ్ ను పూర్తి చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.ఈసినిమా కోసం చరణ్ బరువు పెరగనున్నాడు.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన ఈసినిమాను తెరకెక్కించనుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ నటించనుంది.కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























