సావిత్రి గారిలా నేను కూడా అలాంటి సీన్ చేయగలను

KA Heroine Nayan Sarika Says, She Inspired by Mahanati Movie and Actress Savitri

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌’క’ సినిమాను రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‘క’ సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్‌పై రిలీజ్ చేయబోతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ‘క’ సినిమా హైలైట్స్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన ఎక్స్‌పీరియన్స్ తెలిపారు హీరోయిన్ నయన్ సారిక.

  • నేను ఆయ్ సినిమాలో నటిస్తున్న టైమ్ లో నా ఫొటోస్ ఇండస్ట్రీలో ఫిలింమేకర్స్ దగ్గరకు సర్క్యులేట్ అయ్యాయి.
  • అలా క సినిమా అవకాశం నా దగ్గరకు వచ్చింది.
  • నేను అప్పుడు ఆయ్ సినిమా షూటింగ్ కోసం ఏపీలో ఉన్నాను. డైరెక్టర్ సందీప్ ఫోన్ చేసి మూవీ గురించి చెప్పారు.
  • నేను హైదరాబాద్ వచ్చాక లుక్ టెస్ట్ చేశాను. ఆ టెస్ట్ అయ్యాక క సినిమాలో సత్యభామ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు.
  • గం గం గణేశాలో మోడరన్ గా ఉంటాను, ఆయ్ సినిమాలో ట్రెడిషనల్ గా కనిపిస్తా. ఆయ్ లో పల్లవి క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుంది.
  • ఆ పాత్రకు భిన్నమైన రోల్ చేయాలని కోరుకున్నా. అనుకున్నట్లుగానే క సినిమాలో సత్యభామ పాత్ర దక్కింది.
  • ఈ చిత్రంలో పూర్తిగా ట్రెడిషనల్ గా కనిపిస్తా. ఈ మూవీ కథ విన్నప్పుడు క్లైమాక్స్ మనసులో గుర్తుండిపోయింది.
  • థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా ఇదే అనుభూతికి లోనవుతారు.
  • కిరణ్ అబ్బవరంతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. ఆయన ఈ ప్రాజెక్ట్ లో ఎంతో ఇన్వాల్వ్ అయ్యారు.
  • ఆయన ఎవరి వర్క్ లోనూ ఇంటర్ ఫియర్ కాలేదు. ప్రతి క్రాఫ్ట్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేవారు.
  • ఈ సినిమాలోని యాక్షన్స్ సీక్వెన్స్ రిస్క్ అయినా ఆయనే స్వతహాగా చేశారు. డూప్ ను పెట్టుకోలేదు.
  • యాక్షన్ ఒరిజినల్ గా రావాలని కిరణ్ గారు ప్రయత్నించారు.
  • సినిమా కోసం ఎంతో డెడికేషన్ తో ఉండటాన్ని కిరణ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయనలో నేను అడ్మైర్ చేసే విషయం అదే.
  • క లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నాం. హీరో ఎవరికి పెయిర్ అనేది మూవీలోనే చూడాలి. ఈ కథలో ఎన్నో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి.
  • ఇప్పుడు ఎక్కువ చెబితే ఆ కిక్ థియేటర్ లో మిస్ అవుతుంది. అందుకే ఎక్కువగా రివీల్ చేయడం లేదు. నేను తన్వీ కలిసి చేసిన సీన్స్ తక్కువ.
  • తక్కువ టైమ్ లో మేమంతా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. సినిమా టీమ్ మొత్తం ఫ్యామిలీలా కలిసిపోయిన వర్క్ చేశారు.
  • క సినిమా టైటిల్ హీరో క్యారెక్టర్ వాసుదేవ్ కు కనెక్ట్ అయి ఉంటుంది.
  • ఈ సినిమాలో నా సత్యభామ క్యారెక్టర్ లుక్ కోసం సావిత్రి గారి లుక్ ను రిఫరెన్స్ గా తీసుకున్నారు.
  • అందుకే హీరో నేను సావిత్రిలా ఉన్నానని డైలాగ్ చెబుతాడు. సావిత్రి గారిలా నేను గ్లిజరిన్ లేకుండా కన్నీళ్ల సీన్ చేయగలను.
  • ఆమె మహానటి చూసి చాలా ఇన్స్ పైర్ అయ్యాను.
  • నా సత్యభామ క్యారెక్టర్ ను సావిత్రి గారిలా ఉన్నానని హీరో చెప్పే డైలాగ్ చాలా రిలవెంట్ గా ఉందని డైరెక్టర్స్ అన్నారు.
  • మా డైరెక్టర్స్ సందీప్ సుజీత్ ఇద్దరూ ఒకే థాట్ ప్రాసెస్ తో ఉండేవారు. వాళ్లు ఎక్కడా డిఫరెన్స్ రాకుండా బాగా మూవీని తెరకెక్కించారు.
  • మా మూవీలో యానివర్సల్ పాయింట్ ఉంది. అందుకే కిరణ్ గారు ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయాలని అనుకున్నారు.
  • ఏ ఒక్కరికో పరిమితం కాని కథ ఇది. ఈ సినిమాలో మేము చూపించబోయే ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా ఉంటాయి.
  • ప్రేక్షకులకు సరికొత్త సినిమాను ఇవ్వబోతున్నాం. సినిమా చివరలో ఇలా మనమూ ఉండొచ్చు కదా అనే రియలైజేషన్ కు ప్రేక్షకులు వస్తారు.
  • ఇలాంటి పాయింట్ ను మన సినిమాల్లో ఎక్కడా చూసి, విని ఉండరు. అందుకే మా మూవీ టీమ్ అంతా సక్సెస్ మీద నమ్మకంతో ఉన్నాం.
  • ప్రస్తుతం కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలో వాటి డీటెయిల్స్ వెల్లడిస్తా.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.