లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. చీఫ్ గెస్టులుగా స్టార్స్

Lucky Baskhar Pre-release Event Vijay Deverakonda and Trivikram Srinivas To Attend as Chief Guests

‘సీతారామం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. ‘సార్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా వుంది. ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 27న హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్ వేదికగా ఈ వేడుక జరుగనుంది.

ఈ క్రమంలో తాజాగా లక్కీ భాస్కర్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ వేదికగా వెల్లడించారు. ఇక మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే ఎదురుకానుంది. దీపావళికి ఈ సినిమాతో పాటు కిరణ్ అబ్బవరం క, శివ కార్తికేయన్-సాయి పల్లవి జంటగా నటించిన అమరన్.. అలాగే భారీ అంచనాలున్న కన్నడ డబ్బింగ్ సినిమా బఘీర విడుదలవుతున్నాయి. దీంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.