మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండియాలో తెలియనివారుండరు. ముఖ్యంగా డాన్స్ లకు పెట్టింది పేరైన చిరంజీవి ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తన అద్భుత నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుదీర్ఘ కెరీర్‌లో 150కి పైగా చిత్రాలలో నటించి, ఇప్పటికీ తన నటనా ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న ఆయన అందుకోని అవార్డులు లేవు, గెలుచుకొని పురస్కారాలు లేవు. అయితే ఇంత పేరు, ప్రఖ్యాతులు సంపాదించిన చిరంజీవి తొలిసారి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నది ఎప్పుడో తెలుసా? కాలేజ్ డేస్‌లో.. అవును, చిరు డిగ్రీ బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోజుల్లో.
ఈ సందర్భంగా ఆయన ఒకసారి ‘రాజీనామా’ అనే నాటకంలో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ నాటకంలో నటనకు గానూ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుచుకున్నారు చిరంజీవి. కాగా ఇదే ఆయన నటనా జీవితంలో అందుకున్న మొదటి అవార్డు. అయితే అప్పటికి ఆయన పేరు ‘శివశంకర వరప్రసాద్’ గానే ఉండటం గమనార్హం. సినిమాలలోకి వచ్చాకనే తన పేరును చిరంజీవిగా మార్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన ఇందుకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు చిరంజీవి. అందులో.. ” ‘రాజీనామా’ .. YNM College Narsapurలో ‘రంగస్థలం’ మీద తొలి నాటకం.. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు.. అది Best Actor కావటం.. ఎనలేని ప్రోత్సాహం. 1974 -2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఎనలేని ఆనందం” అని పేర్కొన్నారు. దీనికి నాటి తన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను జతచేసారు. కాగా ప్రస్తుతం చిరు పెట్టిన ఈ పోస్ట్ నిట్ఠితా వైరల్ అవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























