`పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. కాగా… ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తదుపరి చిత్రం `F2` ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సోలో హీరో సబ్జెక్ట్‌లనే డీల్ చేసిన అనిల్.. తొలిసారిగా ఈ సినిమా కోసం మల్టీస్టారర్ సబ్జెక్ట్ ని టేకప్ చేయడం విశేషం. వెంకటేష్, వరుణ్ తేజ్ తొలిసారిగా కలసి నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఉంది. ఇదిలా ఉంటే… అనిల్ చిత్రాలను పరిశీలిస్తే ఓ విషయం స్ఫష్టంగా అర్థమవుతుంది. అదేమిటంటే… తన గత చిత్రాల్లోని కథానాయిలను నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కు ఏదో రూపంలో రిపీట్ చేస్తుండడం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. అనిల్ రావిపూడి తొలి చిత్రం `పటాస్`లో హీరోయిన్గా నటించిన శ్రుతి సోథి… రెండో చిత్రం `సుప్రీమ్`లో తళుక్కున మెరవగా… ఇక రెండో సినిమా `సుప్రీమ్`లో కథానాయికగా నటించిన రాశీ ఖన్నా.. మూడో చిత్రం `రాజా ది గ్రేట్`లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. అలాగే మూడో చిత్రం `రాజా ది గ్రేట్`లో నాయికగా నటించిన మెహరీన్… నాలుగో సినిమా `F2`లో ఇద్దరు హీరోయిన్స్‌లో ఒకరిగా నటిస్తోంది. యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయమో… లేదంటే అనిల్ సెంటిమెంట్ గా ఫీల్ అయి ఇలా రిపీట్ చేస్తున్నాడో తెలియదు కానీ… ఈ ఫార్ములా అయితే ఇప్పటివరకు బాగానే వర్కవుట్ అయ్యింది. మరి… ఈ సెంటిమెంట్ ప్రకారం… రాబోయే చిత్రంలో తన నాలుగో చిత్ర కథానాయిక తమన్నాని గెస్ట్ రోల్లోనో లేదంటే హీరోయిన్‌గానో అనిల్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
[youtube_video videoid=2F4DHcfKDHY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: