మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు. శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ మెయిన్ క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ సినిమా యాక్షన్ ప్యాక్డ్ హ్యామరస్గా వుంటుందని ప్రామిస్ చేసింది. నవంబర్ 22న విడుదల కానున్న సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చిత్ర విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా మాస్ కా దాస్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం..
“ఇప్పుడున్న పరిస్థితిలో ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేయడం చాలా తక్కువ మందికి కుదురుతుంది. ఇంతదూరం వచ్చానంటే ఈ జర్నీలో ఇద్దరే వున్నారు. ఒకటి నేను, రెండు మీరు. నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చింది మీ అభిమానమే. నవంబర్ 22 సినిమా రిలీజ్. సినిమా మొన్న చూసుకున్నా. చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను.”
“నవంబర్ 21, 7.30కి పెయిడ్ ప్రిమియర్స్ వేస్తాం. యూఎస్ షో కంటే ముందే చూసుకోండి. అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా. సినిమా ఎడ్జ్ అఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. రెండోసారి సినిమా చూసే రేంజ్ లో వుంది.సెకండ్ హాఫ్ థియేటర్స్ అన్నీ అడిటోరియమ్లా మారిపోతాయి. ఇది ట్రైలర్ 1.0. రిలీజ్ దగ్గరలో మరో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్‌కి ట్రైలర్ అనుకోండి.”
“మాకు నిర్మాత రామ్ గారు చాలా సపోర్ట్‌గా నిలిచారు. ఈ సినిమాతో ఆయనకి చాలా డబ్బులు రావాలి. శ్రద్ధ వండర్ ఫుల్ కో స్టార్. మీనాక్షికి థాంక్ యూ సో మచ్. ఆడియెన్స్ మా కెమిస్ట్రీని చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ రవి థాంక్ యూ సో మచ్. జేమ్స్ బిజోయ్ బీజీఎం ఇరగదీశాడు. టీంలో పని చేసిన అందరికీ థాంక్ యూ. ఫ్యాన్స్ అందరికీ లవ్ యూ సో మచ్. నవంబర్ 22న థియేటర్స్‌లో కలుద్దాం” అని అన్నాడు హీరో విశ్వక్ సేన్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























