అనిరుధ్ చేతిలో 12 సినిమాలు

Anirudh scores music for twelve upcoming films

సౌత్ లో ప్రస్తుతం పీక్ ఫామ్ లో వున్నాడు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్.రీసెంట్ గా వచ్చిన దేవర లో కూడా అనిరుధ్ సంగీతం ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.నార్మల్ సీన్లను కూడా తన బీజీఎమ్ తో ఎలివేట్ చేయడంలో అనిరుధ్ స్టైలే వేరు.ఇంతకుముందు లియో , జైలర్ సినిమాల్లో కూడా అనిరుధ్ మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది.ఇక ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు తమిళం లోనే కాదు తెలుగులోనూ ఫుల్ డిమాండ్ వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందుకు తగ్గట్లు ప్రస్తుతం తమిళ్, తెలుగులో కలిపి ఏకంగా 12సినిమాలు లైన్లో వున్నాయి అందులో తెలుగు నుండి విజయ్ దేవర కొండ 12వ సినిమా అలాగే సితార ఎంటెర్టైమెంట్స్ ,గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న మ్యాజిక్ అలాగే నాని ,శ్రీకాంత్ ఓదెల 2 ,దేవర 2 చేస్తున్నాడు.ఇక కోలీవుడ్ లో కూడా క్రేజీ ప్రాజెక్టులు వున్నాయి.

అందులో రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ కూలీ అలాగే దళపతి విజయ్ 69, అజిత్ విడా ముయార్చి ,కమల్ హాసన్ -శంకర్ ల ఇండియన్ 3 , శివ కార్తికేయన్-మురగదాస్ ల ఎస్ కె ఏ ఆర్ ఎమ్(వర్కింగ్ టైటిల్) అలాగే లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఎల్ ఐ కె ,యంగ్ హీరో కెవిన్ అప్ కమింగ్ మూవీ తోపాటు కింగ్ అనే సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే ఈలిస్ట్ లో మరికొన్ని సినిమాలు కూడా జాయిన్ కానున్నాయి.అందులో తెలుగు సినిమాలు కూడా ఉండనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.