మచ్ అవైటెడ్ సూర్య కంగువా వచ్చే నెల 14న థియేటర్లలోకి వస్తుంది.దాంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీం.పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న నార్త్ లో ప్రమోట్ చేశారు.త్వరలోనే హైదరాబాద్ లో కూడా భారీ ఈవెంట్ జరుగనుంది.ఇక ఈసినిమా నుండి ఇంతకుముందు ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈనెల 21న సెకండ్ సాంగ్ కూడా రానుంది.రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో శివ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా దిశా పటాని ,బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.స్టూడియో గ్రీన్ తో కలిసి భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.ఇక చాలా గ్యాప్ తరువాత సూర్య నుండి వస్తున్న సినిమా కావడంతో కంగువా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలావుంటే సూర్య రీసెంట్ గా తన 44 వ సినిమాను కూడా పూర్తి చేశాడు.పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.ఇక త్వరలోనే సూర్య తన 45వ సినిమాను కూడా మొదలు పెట్టనున్నాడు.ఆర్ జె బాలాజీ ఈసినిమాను తెరకెక్కించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























