ట్రైలర్‌లో చూసింది 1% మాత్రమే

Ananya Nagalla Reveals Interesting Facts About Pottel

చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో ‘పొట్టేల్’ మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అజయ్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా శుక్రవారం స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ చేతులమీదుగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ట్రైలర్ మరింత అంచనాలను పెంచింది.

ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ళ మాట్లాడుతూ.. ట్రైలర్‌లో చూసింది 1% మాత్రమే, సినిమా చూసిన ఆడియన్‌గా చెప్తున్నాను. ఈ సినిమా ఆడియన్స్‌తో ఒక వన్ వీక్ ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. డైరెక్టర్ సాహిత్ ఈ సినిమాని చాలా అద్భుతమైన లేయర్స్‌గా రాశాడు. ప్రతి లేయర్‌ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటాం. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు గ్రేట్ స్టోరీ ఉంది. అక్టోబర్ 25న రిలీజ్ అవుతుంది. మీరందరూ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు

ఇక హీరో యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. సాహిత్ ట్రైలర్‌ని అద్భుతంగా కట్ చేశాడు. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన సంయుక్త గారికి థాంక్యూ సో మచ్. నాలాంటి ఒక అప్ కమింగ్ యాక్టర్‌కి ఇంత మంచి స్కేల్ ఉన్న సినిమాలో ఇంత మంచి ఆర్టిస్టులతో కలిసి నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రేమించి ఈ సినిమా చేశాం. వీళ్లందరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఒక జెన్యూన్ ఫిలింని మీరంతా చూడబోతున్నారు. అక్టోబర్ 25న మీ అందరితోపాటు సినిమా చూడాలని చాలా ఎక్సైటింగ్‌గా ఉంది” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.